TG: ఈ నెల 26 నుంచి నాగర్కర్నూల్ జిల్లా సోమశిల నుంచి శ్రీశైలం వరకు లాంచీ ప్రయాణాన్ని రాష్ట్ర పర్యాటకశాఖ అందుబాటులోకి తీసుకురానుంది. ఒకేసారి 120 మంది ప్రయాణించేలా డబుల్ డెక్కర్ తరహాలో ఏసీ లాంచీని ఏర్పాటు చేసింది. కృష్ణా నదిలో సోమశిల నుంచి శ్రీశైలం వరకు (120 కి.మీ) 7 గంటలపాటు లాంచీ ప్రయాణం ఉంటుంది. ఈ లాంచీ ప్రయాణానికి పెద్దలకు రూ.2 వేలు, పిల్లలకు రూ.1,600 టికెట్ ధర నిర్ణయించింది.