TG: హైదరాబాద్ నగర వ్యాప్తంగా నిన్న రాత్రి భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా చాలా ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ క్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్ఎంసీ, పోలీసు సిబ్బంది సమన్వయంతో పని చేయాలని సూచించారు. ముఖ్యంగా డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. లోతట్టు ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.