TG: నేడు ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద బీజేపీ మహాధర్నా చేపట్టనుంది. మూసీ సుందరీకరణ, హైడ్రాకు వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన ధర్నా చేయనున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్ర ఐదు గంటల వరకు ధర్నా సాగనుంది. మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసించే వారి ఇళ్లను కూల్చవద్దని డిమాండ్ చేయనున్నారు. మహాధర్నాలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర పదాధికారులు, ముఖ్యనేతలు పాల్గొననున్నారు.