TG: మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను టాలీవుడ్ నటులు ఖండించారు. ‘సినీ నటుల కుటుంబాలపై నిరాధారమైన వ్యాఖ్యలు సరికాదు. గౌరవప్రదమైన స్థాయిలో ఉన్నవారు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ముఖ్యంగా మహిళల పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలి’ అని అల్లు అర్జున్ అన్నారు. సినీ ప్రముఖులను రాజకీయ పావులుగా వాడుకోవటం అవమానకరమని.. గాసిప్ నుంచి పాలనవైపు దృష్టి మరల్చాలి’ అని సుధీర్ బాబు హితవు పలికారు.