కేంద్ర ప్రభుత్వం సహా హర్యానా, పంజాబ్ సర్కార్లపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ కాలుష్యంపై ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ తమ ఆదేశాలను పాటించడం లేదని పేర్కొంది. పంట వ్యర్థాలు కాల్చిన వారి నుంచి హర్యానా, పంజాబ్ నామమాత్రపు జరిమానాలు వసూలు చేసి సరిపెడుతున్నాయని వ్యాఖ్యానించింది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం, ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ వారంలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది.