TG: బెల్లంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వినోద్‌కు మావోయిస్టులు హెచ్చరికలు జారీ చేశారు. సింగరేణి కోల్ బెల్ట్ కమిటీ కార్యదర్శి ప్రభాత్ పేరిట ఓ లేఖ విడుదల చేశారు. ఈ లేఖలో బెల్లంపల్లిలో ఎమ్మెల్యే అతడి అనుచరులు భూ కబ్జాలు చేస్తున్నారని పేర్కొన్నారు. నాడు BRS పార్టీలో కొంత మంది భూ కబ్జాలకు అలవాటు పడి కాంగ్రెస్‌లోకి చేరినప్పటికీ వారి అలవాటు మారలేదన్నారు. ఎమ్మెల్యేతో పాటు అతని పీఏ కూడా బాధ్యత వహించాలన్నారు.