TG: రాష్ట్ర రాబడులు పెంచే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి పొంగులేటి వెల్లడించారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా హామీలన్నీ నెరవేరుస్తామని తెలిపారు. హైడ్రాపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, పేదలను ఇబ్బంది పెట్టాలనేది ప్రభుత్వ విధానం కాదన్నారు. హైదరాబాద్ మరో చెన్నై, బెంగళూరు కాకూడదనే చెరువులను ఆక్రమణల నుంచి కాపాడుతున్నామని పేర్కొన్నారు.