బీహార్‌లోని ముంగేర్‌లో దారుణం చోటుచేసుకుంది. రాష్ట్రీయ జనతాదళ్ సీనియర్ నేత పంకజ్ యాదవ్‌పై కొందరు దుండగులు తుపాకీతో కాల్పులు జరిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పంకజ్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఖాసిం బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎయిర్‌పోర్టు గ్రౌండ్స్‌లో ఆయన మార్నింగ్ వాక్ చేస్తుండగా దుండగులు కాల్పులు జరిపారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.