TG: సమగ్ర కుటుంబ సర్వే ప్రతిష్టాత్మకమైందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాష్ట్రంలో ఇంటింటి కుటుంబ సర్వేను ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. ‘కుటుంబ సర్వే ద్వారా ఈనెల 9నుంచి కుటుంబసభ్యుల వివరాలు సేకరిస్తాం. సేకరించిన సమాచారం గోప్యంగా ఉంటుంది. సర్వేలో ఏమైనా తప్పులుంటే విపక్షాలు సలహా ఇవ్వాలి. ఆధార్ కార్డు వివరాలు ఆప్షనల్ మాత్రమే. ఎలాంటి జిరాక్స్లు ఇవ్వొద్దు. ఈ సర్వేను పబ్లిక్ డొమైన్లో పెడతాం’ అని తెలిపారు.