చెన్నైలో అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురుస్తుంది. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. గిండి, టి.నగర్, కొడంబాకం సహా పలు ప్రాంతాల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. రహదారులు జలమయమయ్యాయి. పలుచోట్ల వాహనాలు నీటిలోనే నిలిచిపోయాయి. భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు, జనజీవనం స్తంభించింది. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాలకు వాతవరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.