ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టు అయిన ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో కవితకు మళ్లీ షాక్ తగిలింది. ఆమె జ్యుడిషియల్ రిమాండ్‌ను పొడిగిస్తున్నట్లు రౌస్ అవెన్యూ కోర్టు తెలిపింది.
ఢిల్లీలోని ఐటీఓ ప్రాంతంలోని ఆదాయపు పన్ను శాఖ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. మంటల కారణంగా ఫ్లోర్ మొత్తం గందరగోళం నెలకొంది. వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించడంతో 21 అగ్నిమాపక వాహనాలు అక్కడికి చేరుకున్నాయి.
రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి చేసిన కేసులో దాదాపు 30 గంటల తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ మౌనం వీడింది. రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌తో అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ దురుసుగా ప్రవర్తించారని, దీనిపై సీఎం దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ కోరింది.
ఢిల్లీలోని తీహార్ జైలుకు బాంబు బెదిరింపు వచ్చింది. మంగళవారం ఈమెయిల్ ద్వారా ఈ బెదిరింపు వచ్చింది. ఈ ముప్పు గురించి తీహార్ పరిపాలన ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించింది.
పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ కష్టాలు పెరుగుతున్నాయి. ఇప్పుడు గవర్నర్ పై ఓ డ్యాన్సర్ తీవ్ర ఆరోపణలు చేసింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. కొన్ని నెలల క్రితం ఓ ప్రముఖ సంగీత విద్వాంసుడు ద్వారా కోల్‌కతాలోని రాజ్‌భవన్‌కు వెళ్లింది.
ఢిల్లీ మద్యం కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) మంగళవారం ఢిల్లీ హైకోర్టులో కీలక ప్రకటన చేసింది. దీనిపై గత కొన్ని నెలలుగా చాలా ఊహాగానాలు ఉన్నాయి.
ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్ యాత్ర ప్రారంభమైంది. దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో చార్ధామ్‌కు చేరుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చార్‌ధామ్ యాత్ర నిర్వహణ సరిగా లేకపోవడంతో యాత్రికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
భారత దేశంలో ఉన్న ఓల్డెస్ట్ ఫీమేల్ బిలియనీర్‌గా సుబ్బమ్మ జాస్తి ఫోర్బ్స్ రికార్డులకెక్కారు. హైదరాబాద్‌కు చెందిన ఆమె వివరాలు ఇలా ఉన్నాయి.
పెళ్లీడుకొచ్చిన పిల్లకి చక్కని వరుడు కావలెను అంటూ ప్రకటనలను మనం చూసే ఉంటాం. అయితే కర్ణాటకలో మాత్రం 30 ఏళ్ల క్రితం చనిపోయిన తన కూతురికి వరుడు కావాలంటూ ఓ కుటుంబం వారు పత్రికలో ప్రకటన వేశారు. ఎందుకంటే?
సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్రమోదీ ఈరోజు వారణాసి నుంచి నామినేషన్ వేయనున్నారు. అయితే ఈ ప్రాంతంతో తనకు ముడిపడి ఉన్న జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఓ వీడియోను మోదీ షేర్ చేశారు.
ముంబయిలో ఈదురు గాలులు, భారీ వర్షాల ధాటికి పెద్ద హోర్డింగ్ ఒకటి విరిగి పడింది. ఈ ఘటనలో పెద్ద జననష్టమే జరిగిందని చెప్పవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఉత్తర ప్రదేశ్‌లో జరిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. మరొకరు గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ తనయుడు, జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్‌డి రేవణ్ణకు కోర్టు నుంచి ఊరట లభించింది. కిడ్నాప్ కేసులో షరతులతో కూడిన బెయిల్ పొందాడు.
లోక్‌సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్ జరుగుతున్న సమయంలో పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ నేత దిలీప్ ఘోష్ కాన్వాయ్‌పై దాడి ఘటన వెలుగు చూసింది.
ఎప్పుడు బిజీగా ఉండే ముంబాయి నగరంలో ఈరోజు మధ్యాహ్నం దుమ్ము తుపాన్ వచ్చింది. వాతావరణంలో కూడా మార్పులతో పాటు విపరీతంగా దుమ్ము రావడం, ఆకాశం నల్లగా మారిపోవడం వంటివి జరిగాయి.