జౌన్‌పూర్‌లోని మడియాహున్ పోలీస్ స్టేషన్ పరిధిలో హృదయ విదారకమైన కేసు తెరపైకి వచ్చింది. పోలీస్ స్టేషన్ పరిధిలోని జైరాంపూర్ గ్రామంలో ఈ తెల్లవారుజామున ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి.
భయంకరమైన ప్రమాదం నాగాలాండ్‌లో జరిగింది. అక్కడ జాతీయ రహదారి గుండా వెళుతున్న మూడు కార్ల పైన వర్షాల మధ్య భారీ రాళ్ళు అకస్మాత్తుగా పడిపోయాయి. బండరాళ్ల కారణంగా మూడు కార్లు పూర్తిగా నుజ్జునుజ్జయ్యాయి. అందులో ఉన్న వారిలో ఇద్దరు మరణించారు.
బెంగళూరు(bangalore)లో జరిగిన ఉత్కంఠభరితమైన పోరులో భారత(india) ఫుట్‌బాల్ జట్టు కువైట్(Kuwait) ను ఓడించి SAFF ఛాంపియన్‌షిప్ 2023లో టైటిల్ ను కైవసం చేసుకుంది. క్లాష్ పెనాల్టీలో భారత్ జట్టు 5-4 తేడాతో ప్రత్యర్థి జట్టును ఓడించింది.
విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు పెట్టుబడులను కొనసాగించడం, ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను బలోపేతం చేయడం కూడా మార్కెట్‌కు మద్దతునిచ్చాయి. ఇండెక్స్‌లో బలమైన వాటాను కలిగి ఉన్న బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఇన్ఫోసిస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) షేర్లలో కొనుగోళ్లు కూడా మార్కెట్‌కు మద్దతు ఇచ్చాయి.
2019లో కర్ణాటక ఎన్నికల సందర్భంగా, రాహుల్ గాంధీ ప్రధాని మోడీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత ఆయన లోక్‌సభ సభ్యత్వం రద్దు చేయబడింది.
ఇక్కడ పోలీసులు ఓ మహిళను కారు బానెట్‌కు కట్టి 500 మీటర్లు లాక్కెళ్లారు. స్మగ్లింగ్ ఆరోపణలపై పట్టుబడిన తన కొడుకును రక్షించడానికి పోలీసులను ఆశ్రయించడమే మహిళ ఏకైక తప్పు. అక్కడ ఉన్న వ్యక్తులు పోలీసుల తీరును వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు.
ఎంఎం కీరవాణి. మొన్నటి వరకు కేవలం టాలీవుడ్ కి మాత్రమే తెలిసిన ఈ పేరు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నారు. ఆర్ఆర్ఆర్ తో ఆస్కార్ సొంతం చేసుకొని ఆయన తన కీర్తిని, మన టాలీవుడ్ కీర్తిని ప్రపంచ నలుమూలలకు చేరవేశారు. కుటుంబమంతా సినిమాల్లోనే ఉన్న ఈ సంగీత దర్శకుడు తన తొలి రోజుల్లో మంచి బ్రేక్ కోసం చాలా కష్టపడ్డాడు. తరువాత అతను ప్రేమ కథలు, వాణిజ్య చిత్రాలు, భక్తి చిత్రాలకు సంగీతాన్ని ...
కిలోల లెక్కన టమాటా కొనుగోలు చేసే వారు ఇప్పుడు గ్రాముల లెక్కన కొనుగోలు చేస్తున్నారు. దాదాపు నెల రోజుల క్రితం టమాటా హోల్‌సేల్ మార్కెట్‌లో కిలో 1 రూపాయలకు అమ్ముడుపోయింది. నేడు కిలో రూ.200 వరకు విక్రయిస్తున్నారు. ఈ ద్రవ్యోల్బణం రేసులో పచ్చిమిర్చి కూడా తక్కువేమీ కాదు.
ముగ్గురు యువకులు కోరిన కోరిక నెరవేరడంతో సూరజ్‌పూర్‌లోని ఖోపా ధామ్‌కు వచ్చారు. ఇక్కడ ముగ్గురూ బలి ఇవ్వడానికి తమతో పాటు ఒక మేకను తీసుకొచ్చారు. నమ్మకం ప్రకారం మేకను బలి ఇచ్చారు. అప్పుడు పచ్చి మాంసం తింటుండగా ఈ ప్రమాదం జరిగింది.
కేరళను నైరుతి రుతుపవనాలు చుట్టుమట్టాయి. రాష్ట్రమంతటా జలాశయాలు నిండుకుండలా మారాయి. తీరప్రాంత ప్రజలు ప్రాణాలు ఆరిచేతుల్లో పెట్టుకుని బతుకుతున్నారు. అధికారులు చర్యలు చేపట్టారు.
మంగళవారం నాడు ఆయన భార్య టీనా అంబానీని ఈడీ ప్రశ్నిస్తోంది. దీంతో టీనా అంబానీ ఈడీ ఎదుట హాజరై వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. విదేశీ మారకద్రవ్య చట్టాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలకు సంబంధించిన దర్యాప్తుకు సంబంధించి ED ఈ విచారణ చేస్తోంది.
కమర్షల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు మళ్లీ పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో గ్యాస్ సిలిండర్ ధర రూ. 1780 వరకు పెరిగింది.
మెట్రో రైలులో ఓ అమ్మాయి ఓ అబ్బాయిని చెంపలు పగులకొట్టి దుర్భాషలాడింది. ఈ సమయంలో అబ్బాయి నిశ్శబ్దంగా అమ్మాయి బూతులు వింటూ ఉన్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, దీనిపై రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
ఢిల్లీ ఎయిమ్స్ లో ఘరానా మోసం బయటపడింది. నీట్ పరీక్షలో విద్యార్థుల స్థానంలో వేరేవారు పరీక్ష రాసినట్లు రుజువైంది. అందుకోసం ఒక్కో విద్యార్థి దగ్గర 7లక్షల వరకు వసూల్ చేసినట్లు తేలింది.
భారతీయ ప్రభుత్వం కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో వ్యక్తులకు, సంస్థలకు పన్నుల మినహాయింపు ఇచ్చింది. వీటి గురించి తెలుసుకుంటే పన్ను చెల్లింపుదారులు తమ భారాన్ని తగ్గించుకోవచ్చు.