ఇద్దరు నిందితులను జైలుకు వెళ్లకుండా ఎలుకలు కాపాడాయి. సాక్ష్యాలు లేకపోవడంతో కోర్టు నిందితులిద్దరినీ నిర్దోషులుగా ప్రకటించింది. అయితే సాక్ష్యాలను చెరిపివేసే పని మనుషులు కాదు, ఎలుకలు చేశాయి. దాదాపు 22 కిలోల గంజాయిని ఎలుకలు తినగా, నిందితులకు కోర్టు నుంచి ఉపశమనం లభించింది.
కొన్ని తక్కువ దూరం నడిచే వందే భారత్ రైళ్లలో ఖాళీగా ఉన్న సీట్లను దృష్టిలో ఉంచుకుని రైల్వే ఛార్జీలను సమీక్షిస్తోంది. సాపేక్షంగా తక్కువ దూరం ఉన్న కొన్ని వందే భారత్ రైళ్లలో సీట్లు పూర్తిగా నింపబడవు. ఇలాంటి పరిస్థితిలో వారి ఛార్జీలను సమీక్షించడం ద్వారా వాటిని ఆకర్షణీయంగా మార్చాలని రైల్వే యోచిస్తోంది.
ప్రపంచంలో అత్యంత ధనవంతుడైన బిచ్చగాడు మన భారతీదేశంలో ముంబై నగరంలో ఉంటున్నాడు. అతని ఆస్తి విలువ తెలిస్తే ఆశ్చర్యపోతారు.
సందడే సందడి, ఖుషీ ఖుషిగా, స్వాగతం, ఏక్ నిరంజన్ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఆదిత్య రామ్ దాదాపు పుష్కరకాలం తర్వాత సినీ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు.
భోపాల్ సీఎం ఇంటినివాసం వద్ద మూత్ర విసర్ణన బాధితుడి కాళ్లు కడిగి క్షమాపణలు చెప్పిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.
మార్కెట్ లో దొంగలు పడి టమాటాలను చోరీ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా టమాటా దొంగతనాలపై కేసులు నమోదవుతున్నాయి.
వివాదాస్పద స్వామి నిత్యానంద మరోసారి వార్తల్లో నిలిచారు. తమ దేశం అయిన కైలాస దేశ ప్రధానిగా నటి రంజితను నియమించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రకటన సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది.
దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాలకు న్యాయమూర్తులను మార్చుతూ కొలీజియం సిఫారసు చేసింది. ఏపీ, తెలంగాణకు కూడా సీజేలను మార్చుతూ ఉత్తర్వులు వెలువడ్దాయి.
మైదానంలో ఎప్పుడూ కూల్ గా కనిపించే మహేంద్ర సింగ్ ధోని బూతులు మాట్లాడుతాడని ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ అన్నారు.
టీమిండియా ఆగస్టులో వెస్టిండీస్‌తో తలపడనుంది. టీ20 సిరీస్ జరగనున్న నేపథ్యంలో బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది.
తెలంగాణకు మరో 8 మెడికల్ కళాశాలలు మంజూరయ్యాయి. దీంతో తెలంగాణలోని ప్రతి జిల్లాలో ఓ మెడికల్ కాలేజీ ఏర్పాటు కానుంది. ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య కూడా మొత్తంగా 10 వేలకు చేరుకోనుంది.
ఆధార్ కార్డు, రేషన్ కార్డులను లింక్ చేసుకోవడానికి మరోసారి కేంద్రం గడువును పెంచింది. సెప్టెంబర్ 30, 2023లోగా ఆధార్, రేషన్ కార్డులు లింక్ చేసుకోవాలని సూచించింది.
ప్రవేశ్ శుక్లాపై జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదైంది. తాగిన మత్తులో ఊగుతూ ఆ వ్యక్తి ఆదివాసి యువకుడిపై మూత్ర విసర్జనకు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చంద్రయాన్ పేలోడ్ ఉన్న క్యాప్సూల్‌ను జీఎస్ఎల్వీ రాకెట్‌తో ఈ రోజు అనుసంధానం చేశారు. సతీశ్ ధావన్ సెంటర్‌లో రాకెట్‌కు చంద్రయాన్ క్యాప్సూల్‌ను ఫిక్స్ చేశారు.
క్రెడిట్ కార్డులు వాడేవారికి మరో ఆందోళన మొదలైంది. ఇకపై క్రెడిట్ కార్డు ద్వారా వచ్చే క్యాష్ బ్యాక్‌పై సర్కార్ జీఎస్టీ విధించనుంది.