The Center's new policy is to remove Siren for VIP government officials and allow them to listen to Indian music
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి బెదిరింపులు వచ్చాయి. ఆయన కార్యాలయానికి ఓ వ్యక్తి ఫోన్ చేసి బెదిరించడం గమనార్హం. అతను.. తాను దావూద్ గ్రూప్ కి చెందినవాడినని చెప్పడం గమనార్హం. ఆ ఫోన్ చేసిన వ్యక్తి కర్ణాటకలోని బెలగావి జైలు నుంచి ఈ బెదిరింపు కాల్ వచ్చినట్లు అధికారులు తెలిపారు.
బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి జయేష్ పూజారిగా పోలీసులు గుర్తించారు.ఓ హత్య కేసులో కోర్టు జయేష్ కు మరణశిక్ష విధించింది. నాగ్‌పూర్ పోలీసుల బృందం సోమవారం పూజారిని ప్రశ్నించడానికి అనుమతించాలని బెలగావి జైలు అధికారులను అభ్యర్థించింది. నాగ్‌పూర్‌లోని ఖమ్లా ప్రాంతంలోని గడ్కరీ పబ్లిక్ రిలేషన్స్ కార్యాలయంల్యాండ్లైన్ నంబర్‌కు మూడు బెదిరింపు కాల్లు వచ్చాయి. ఈ బెదిరింపు కాల్స్ తర్వాత బీజేపీకి చెందిన నాగ్‌పూర్ ఎంపి ఇల్లు, కార్యాలయం వద్ద భద్రతను పటిష్ఠ చేశారు.తన డిమాండ్లను నెరవేర్చకుంటే మంత్రికి హాని చేస్తానని ఫోన్ చేసిన వ్యక్తి బెదిరించినట్లు పోలీసులు చెప్పారు.