»Man Convicted Of 2014 Murder With Parrots Testimony Gets Life In Jail
Murder : తొమ్మిదేళ్ల క్రితం హత్య… నిందితులను పట్టించిన చిలుక..!
Murder : దాదాపు తొమ్మిది సంవత్సరాల క్రితం ఓ హత్య జరిగింది. ఆ హత్య కేసులో నిందితులు పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటూ వస్తున్నారు. అయితే... ఓ చిలుక ఈ హత్య కేసులో నిందితులను పట్టించడం గమనార్హం. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాలో చోటుచేసుకోగా..... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
దాదాపు తొమ్మిది సంవత్సరాల క్రితం ఓ హత్య జరిగింది. ఆ హత్య కేసులో నిందితులు పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటూ వస్తున్నారు. అయితే… ఓ చిలుక ఈ హత్య కేసులో నిందితులను పట్టించడం గమనార్హం. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాలో చోటుచేసుకోగా….. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
2014 ఫిబ్రవరి 20న ఆగ్రాకు చెందిన విజయ్ శర్మ భార్య.. నీలమ్ శర్మ తమ ఇంట్లోనే హత్యకు గురయ్యారు. ఆమెను హత్య చేసిన నిందితులు ఆమెను, ఆమె పెంపుడు కుక్కను కూడా అనేకసార్లు పదునైన ఆయుధంతో పొడిచి.. దారుణంగా హత్య చేశారని పోస్ట్ మార్టంలో తేలింది.
ఆ సమయంలో ఈ కేసులో కొంతమందిని అనుమానితులుగా భావించి విచారించారు. అయితే, సరైన సాక్ష్యాధారాలు దొరకలేదు. దీంతో ఆ కేసు అలాగే పెండింగ్లో ఉండిపోయింది. దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు హత్య జరిగిన రోజు నుంచి విజయ్ శర్మ పెంపుడు చిలక అన్యమనస్కంగా ఉంటుంది. సరిగా తినడం లేదు. అయితే, విజయ్ శర్మకు అషు అనే మేనకోడలు ఉంది. ఆమె అప్పుడప్పుడు వీరి ఇంటికి వచ్చేది. నీలమ్ శర్మ హత్య జరిగిన తరువాత ఎప్పుడు అషు వచ్చినా… ఆమెను చూసి చిలుక విపరీతంగా అరుస్తుండేది. దీంతో విజయ్ శర్మకు చిలక ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించింది. నీలంను హత్య చేసిన నిందితులను చిలక చూసిందేమో అని సందేహించాడు. ఈ విషయాన్ని విజయ్ శర్మ పోలీసులకు తెలిపాడు.
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. గతంలో అనుమానితులుగా ఉన్నవారితో పాటు అషును కూడా పోలీసులు చిలకముందు నిలబెట్టారు. అప్పుడు కూడా చిలక ఆమెను చూసి విపరీతంగా అరవడం మొదలుపెట్టింది. దీంతో విజయ్ శర్మ అనుమానం, పోలీసుల సందేహం తీరినట్లు అయింది. వెంటనే అషును అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించగా ఆమె అసలు విషయాన్ని చెప్పుకొచ్చింది.
డబ్బు, నగలకోసం నీలం శర్మను.. రోన్ని అనే వ్యక్తితో కలిసి తానే హత్య చేసినట్లుగా ఒప్పుకుంది. ఈ మేరకు పోలీసులు ఛార్జి షీట్ తయారు చేశారు. అయితే, ఈ చార్జిషీట్లో పోలీసులు చిలుక వాంగ్మూలాన్ని ప్రస్తావించలేదు. చిలుకను కోర్టులో సాక్షిగా ప్రవేశపెట్టలేదు. హత్య జరిగిన ఆరు నెలల తర్వాత సదరు చిలుక చనిపోయింది. కాగా 9 ఏళ్ల తర్వాత తాజాగా ప్రస్తుతం ఈ కేసులో ప్రత్యేక న్యాయస్థానం జడ్జి దోషులు ఇద్దరికీ జీవిత ఖైదు విధించారు.