కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలు, యువత ఆరోగ్యాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా హుక్కా తాగడంపై నిషేధం విధించింది. తక్షణమే ఇది అమల్లోకి వస్తుందని ఆరోగ్యశాఖ మంత్రి దినేశ్ గుండూరావు తెలిపారు.
Karnataka: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలు, యువత ఆరోగ్యాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా హుక్కా తాగడంపై నిషేధం విధించింది. తక్షణమే ఇది అమల్లోకి వస్తుందని ఆరోగ్యశాఖ మంత్రి దినేశ్ గుండూరావు తెలిపారు. హుక్కా తాగడం వల్ల ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా హుక్కాను నిషేధిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తు తరాలకు మెరుగైన, సురక్షితమైన ఆరోగ్యకర వాతావరణాన్ని సృష్టించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తెలిపారు.
హుక్కా వ్యసనంలో ఎంతో మంది అనారోగ్యం పాలవుతున్నారు. దీనిలో భాగంగా COTPA చట్టాన్ని సవరించి హుక్కాపై నిషేధం విధించారు. పొగాకు ఉత్పత్తులకు యువత బానిసలుగా మారుతుండటంపై ఆందోళన వ్యక్తం కావడంతో గతేడాది సెప్టెంబర్లో హుక్కా బార్లను ప్రభుత్వం నిషేధించింది. పొగాకు ఉత్పత్తుల కొనుగోలు వయస్సును 18 నుంచి 21 ఏళ్లకు పెంచింది. గతేడాది ఇదే తరహాలో హర్యానా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు, వాణిజ్య సంస్థల్లో వినియోగదారులకు హుక్కా సేవించడంపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది.అయితే, హర్యానాలో గ్రామీణ ప్రాంతాల్లో ఉపయోగించే సాంప్రదాయ హుక్కాలకు ఈ నిషేధం వర్తించదు.