Nominations: ఒంటెపై వెళ్లి నామినేషన్‌ వేసిన అభ్యర్థి… వీడియో వైరల్‌

సార్వత్రిక ఎన్నికల వేళ నామినేషన్ల హడావిడి కొనసాగుతోంది. ఓ స్వతంత్ర అభ్యర్థి నామినేషన్‌ వేయడానికి ఒంటెపై బయలుదేరాడు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్ని చదివేయండి.

  • Written By:
  • Updated On - April 24, 2024 / 02:56 PM IST

Lok Sabha Nominations: అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ఎన్నికలంటే పెద్ద ఘట్టమే. అందుకనే ఈ సమయంలో చిత్రమైన సంఘటనలకూ కొదువ ఉండదు. ప్రచారం కోసం కొంత మంది చేసే పనులు చాలా నవ్వు తెప్పిస్తుంటాయి. తాజాగా ఓ స్వతంత్ర అభ్యర్థి నామినేషన్‌ వేయడానికి ఒంటె పైనెక్కి ఊరేగింపుగా వెళ్లారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు నెట్‌లో వైరల్గా మారింది.

చదవండి : ఇక రైళ్లలో రూ.20కే ఆహారం

మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో(Aurangabad) ఎంపీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధం అయిన సాహెబ్‌ ఖాన్‌ పఠాన్‌ అనే వ్యక్తి చిత్రంగా ఒంటెపైన ఎక్కి నామినేషన్‌ దాఖలు చేయడానికి వెళ్లారు. అంతకు ముందు నగర వీధుల్లో ఒంటె పైనే ఊరేగింపుగా తిరిగారు. మెడలో పూల మాల ధరించిన ఆయన ఒంటెపై దర్జాగా కూర్చుని విక్టరీ సింబల్‌ చూపిస్తూ ఊరేగారు.

చదవండి :   ‘సలార్ 2’లో మరో స్టార్ హీరోయిన్?

దీంతో సాహెబ్‌ ఖాన్‌ పఠాన్‌ గురించి ఆ నగరవాసులంతా చర్చించుకుంటున్నారు. నెట్‌లోనూ దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా(Video viral) మారింది. ఔరంగాబాద్‌ నియోజకవర్గంలో మొత్తం 30,52,724 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ మే 13న ఎన్నికలు జరగనున్నాయి.

Related News