Congress Party: కాంగ్రెస్ పార్టీకి రూ.1700 కోట్ల ఐటీ నోటీసు

లోక్‌సభ ఎన్నికలు ముందున్న వేళ కాంగ్రెస్‌ పార్టీ ఐటీ శాఖ షాకిచ్చింది. భారీగా జరిమానా కట్టాలని నోటీసులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

  • Written By:
  • Publish Date - March 29, 2024 / 01:43 PM IST

Congress Party: కాంగ్రెస్‌ పార్టీ 1700 కోట్ల ఫైన్‌ కట్టాలంటూ ఐటీ శాఖ(Income Tax Department) నోటీసులు జారీ చేసింది. 2017-18 నుంచి 2020 -21 మధ్య కాలానికి సంబంధించిన పన్నుల విషయంలో ఈ ఫైన్‌ విధిస్తూ డిమాండ్‌ నోటీసులు జరీ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. ఆ నోటీసుల్లో జరిమానాతో పాటుగా వడ్డీ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆదాయపు శాఖ తమ అసెస్‌మెంట్‌ను పునః పరిశీలించాలంటూ కాంగ్రెస్‌ పార్టీ ఢిల్లీ హైకోర్టును అభ్యర్థించింది. అయితే దాన్ని కోర్టు కొట్టివేసింది. ఆ వెంటనే ఈ నోటీసులు రావడం జరిగిపోయింది.

చదవండి : రూ. 70వేల మార్కును దాటిన బంగారం ధర

ఈ విషయమై కాంగ్రెస్‌ పార్టీ నేతలు మండిపడుతున్నారు. లోక్‌ సభ ఎన్నికలు ముందున్న వేళ తమ పార్టీని ఆర్థికంగా దెబ్బ కొట్టేందుకే అధికార పక్షం ఇలాంటి చర్యలకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఈ విషయమై వివేక్‌ తంఖా మాట్లాడుతూ ఇలా నోటీసులు జారీ చేయడం అప్రజాస్వామికమని అన్నారు. ఇలాంటి మదింపు ఉత్తర్వులు, పత్రాలు లేకుండా నేరుగా నోటీసులు ఇవ్వడం తగదని అన్నారు. ఈ విషయమై తాము చట్టపరంగా సవాల్‌ చేస్తామని కాంగ్రెస్‌(Congress) పార్టీ చెబుతోంది.

చదవండి :  లాంబొర్గిని కార్ల  రికార్డు సేల్స్‌!

 

Related News

Kishan Reddy: కేసీఆర్ మీద వ్యతిరేకత వల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది

కేసీఆర్‌పై ఉన్న వ్యతిరేకత వల్లే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేసే శక్తి సీఎం రేవంత్‌రెడ్డికి లేదన్నారు.