మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యను చంపి శవాన్ని రోజంతా బెడ్ బాక్స్ లో దాచిపెట్టాడు. విషయం బయటికి పొక్కడంతో పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Madhya Pradesh: మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యను చంపి శవాన్ని రోజంతా బెడ్ బాక్స్ లో దాచిపెట్టాడు. విషయం బయటికి పొక్కడంతో పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన ఉజ్జయినిలో జరిగింది. చనిపోయిన మహిళను దీపా పర్మార్ (40)గా పోలీసులు గుర్తించారు.
వివరాల్లోకి వెళితే.. ఉజ్జయిని జిల్లా నర్వార్ లోని పాలఖండ గ్రామానికి చెందిన దీపా పర్మార్ కు, విజయ్ అనే వ్యక్తితో 1996లో పెళ్లయింది. కొంత కాలం నుంచి దంపతుల మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భార్యపై విజయ్ కోపం పెంచుకున్నాడు. గత బుధవారం రాత్రి ఆమెను దారుణంగా హత్య చేశాడు. అనంతరం దీపా పర్మార్ మృతదేహాన్ని బెడ్ బాక్సులో దాచి పెట్టాడు. చంపిన తర్వాత నేరాన్ని కప్పివేసేందుకు ప్లాన్ చేశాడు. దీపా కనిపించడం లేదని కుటుంబ సభ్యులకు అబద్దం చెప్పాడు. అది నిజమని నమ్మి ఆమె కోసం వెతికారు. దాదాపు 24 గంటల పాటు గాలించిన దీపా ఆచూకీ లభించలేదు.
అయితే గురువారం రాత్రి మద్యం మత్తులో విజయ్.. దీపను హత్య చేశానని, శవాన్ని బెడ్ బాక్స్ లో దాచిపెట్టానని తల్లికి చెప్పాడు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం కోసం హాస్పిటల్ కు తరలించారు. విజయ్ ను అదుపులోకి తీసుకున్నారు.