Fire Accident : పెళ్లి వేడుకలో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి మృతి

పెళ్లి వేడుకలో పేల్చిన బాణసంచా కారణంగా అక్కడ భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి.

  • Written By:
  • Publish Date - April 26, 2024 / 10:57 AM IST

Fire Accident In Wedding Ceremony : వివాహ వేడుక జరుగుతున్న సమయంలో పెళ్లి వేదిక వద్ద భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ఆరుగురు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఈ ఘటన బీహార్‌లోని దర్భంగా( DARBHANGA) ప్రాంతంలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు.

చదవండి :జైసల్మేర్ సమీపంలో కుప్పకూలిన ఎయిర్ ఫోర్స్ విమానం

వివాహం జరుగుతున్నప్పుడు బాణసంచా(FIREWORKS) పేలుస్తున్న సమయంలో గురువారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. బాణసంచా కాల్పులతో తొలుత సిలిండర్‌ దగ్గర చెలరేగిన మంటలు తర్వాత డీజిల్‌ నిల్వ చేసిన ప్రాంతానికి చేరుకున్నాయి. దీంతో అక్కడ భారీ పేలుడుతో కూడిన అగ్ని ప్రమాదం(Fire Accident) జరిగింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు విడిచారని పోలీసులు వెల్లడించారు.

చదవండి : Nanda Kishore: సినిమా తీసి నా ఆస్తి మొత్తం పోగొట్టుకున్నా

గాయపడిన ఆరుగురిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో మూడు పాడి పశువులు కూడా మరణించినట్లు చెప్పారు. ఈ విషయమై దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు. ఘటన గురించి తెలిసిన వెంటనే అధికారులు అక్కడికి చేరుకుని బాధిత కుటుంబానికి సహాయం అందించారని దర్భంగా డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్‌ రాజీవ్‌ రోషన్‌ తెలిపారు.