»Election Commissioner Rajeev Kumar Said That Indian Voters Have Created History
CEC Rajiv Kumar: చరిత్ర సృష్టించిన భారత్ ఓటర్లు
ఎన్నికల వేల భారత్ చరిత్ర సృష్టించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. చాలా రాష్ట్రాల్లో అత్యధికంగా ఓట్లు నమోదు అయినట్లు ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు.
Election Commissioner Rajeev Kumar said that Indian voters have created history.
CEC Rajiv Kumar: సార్వత్రిక ఎన్నికల్లో భారత్ చరిత్ర సృష్టించింది. ఈ ఎన్నికల్లో పురుష ఓటర్లు మాత్రమే కాదు మహిళ ఓటర్లు కూడా రికార్డు క్రియేట్ చేశారు. దేశవ్యాప్తంగా 64.2 కోట్ల మంది భారతీయులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో 31.2 కోట్ల మంది మహిళలు ఉన్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ రాజీవ్ కుమార్(CEC Rajiv Kumar) మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా భారతీయ ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు చాలా ఆనందంగా ఉందని, ఇది కచ్చితంగా వేడుక చేసుకోవాల్సిన సందర్భం అని అన్నారు. చాలా మందికి ఓటు హక్కుపై అవగాహన వచ్చిందని అన్నారు.
కొన్ని చోట్ల రీపోలింగ్ జరగిందని, దానికి ఎన్నికల సంఘం అధికారులు పనితీరే కారణం అని చెప్పారు. 2019 సంవత్సరంలో 540 చోట్ల రీపోలింగ్ జరిగితే 2014లో కేవలం కేవలం 39 చోట్ల మాత్రమే రీపోలింగ్ జరిగిందని రాజీవ్ కుమార్ తెలిపారు. ఈ విషయంలో ఎన్నికల అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎన్నడు లేని విధంగా ఈ సంవత్సరం జమ్ముకశ్మీర్లో అధిక స్థాయిలో ఓటింగ్ నమోదు అయినట్లు తెలిపారు. గత నాలుగు దశాబ్ధాల్లో ఈ స్థాయిలో జమ్మూకశ్మీర్లో ఓటు వేయడం గర్వకారణం అని చెప్పారు. అంతే కాదు హింసకు ఎక్కడ తావు ఇవ్వలేదని దీనికోసం రెండేళ్లు ప్రిపరేషన్ జరిగిందని వెల్లడించారు.
#CEC#RajivKumar applauds Indian citizens for their historic participation in the elections, setting a world record with 642 million voters – 1.5 times more than all G7 countries and 2.5 times more than 27 EU countries. The elections also saw the pic.twitter.com/vgaMDARWRJ
— Glint Insights Media (@GlintInsights) June 3, 2024