నేషనల్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడి ఎన్నిక నేడు జరగనుంది. నిజానికి ఈ బాధ్యతలు రాహుల్ గాంధీ చేపట్టాల్సి ఉంది. గతంలో ఆ బాధ్యతలు ఆయనే తీసుకున్నారు. కానీ అప్పటి ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ… ఆ పదవికి ఆయన రాజీనామా చేశారు. మళ్లీ బాధ్యతలు తీసుకోవాలని నేతలు అందరూ చెబుతున్నప్పటికీ ఆయన సముఖత చూపించలేదు. దీంతో.. అధ్యక్షుడి ఎన్నిక అనివార్యమైంది.
నేడు ఈ ఎన్నికల ఫలితం తేలనుంది. 137ఏళ్ల కాంగ్రెస్ చరిత్రలో ఇలా అద్యక్షుడి ఎన్నిక జరగడం కేవలం ఆరోసారి కావడం విశేషం. 2000 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో సోనియా గాంధీపై జితేంద్ర ప్రసాద్ ఓటమిపాలయ్యారు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగలేదు. కాగా, 22 ఏళ్ల తరువాత మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
మల్లీఖార్జున ఖర్గే, శశిథరూర్ మధ్య పోటీ నెలకొన్నది. ఇరువురు నేతలు రాష్ట్రాల్లో పర్యటించి కాంగ్రెస్ నేతలను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నించారు. అయితే, మెజారిటీ పీసీసీలు మల్లిఖార్జున ఖర్గే వైపు మొగ్గుచూపుతుండగా, యువ నాయత్వం మాత్రం శశిథరూర్వైపు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.
పీసీసీ కి చెందిన ఓటర్లు మద్దతు ఇస్తున్న అభ్యర్థిపేరు ఎదురుగా టిక్ మార్క్ చేయాలని ఏఐసీసీ ఎన్నికల అథారిటీ పేర్కొన్నది. అయితే, గాంధీ కుటుంబం ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నది. అంతేకాదు, తామ కుటుంబం పర్సనల్గా ఎవరికీ సపోర్ట్ చేయడం లేదని ప్రకటించింది. అశోక్ గెహ్లాట్ తప్పుకోవడంతో మల్లిఖార్జున ఖర్గే చివరి నిమిషంలో పోటీలోకి దిగారు.
మల్లిఖార్జున ఖర్గేకు గాంధీ కుటుంబంతో సాన్నిహిత్యం ఉండటంతో పార్టీ సీనియర్ నేతలు ఆయనకు మద్దతు ఇస్తున్నారు. ఈ విధమైన మద్దతును కూడగట్టడంలో శశిథరూర్ విఫలం అయ్యారని నిపుణులు చెబుతున్నారు. అందరికంటే ముందుగా ఎన్నికల బరిలో ఉన్నట్లు ప్రకటించిన శశిథరూర్ ప్రచారం విషయంలో మాత్రం వెనకబడిపోయారు. నేడు ఎన్నికలు జరగనుండగా, అక్టోబర్ 19 వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది.