Sonia Gandhi : సోనియా గాంధీ పై షాకింగ్ కామెంట్స్ చేసిన బీజేపీ ఎమ్మెల్యే
ప్రధాని మోదీ(PM Modi)పై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే చేసిన ‘విష సర్పం’పై స్పందించిన కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ శుక్రవారం కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీని ‘విషకన్య‘గా అభివర్ణించారు. తన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ(Sonia Gandhi)పై బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ యత్నాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమెను విషకన్య అని అభివర్ణించారు.(Pakistan), చైనా దేశాల ఏజెంట్ అని ఆరోపించారు. ప్రధాని మోదీ (PM Modi) ఓ విష సర్పం అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన బసనగౌడ అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. గతంలో మోదీకి వీసా ఇచ్చేందుకు అమెరికా నిరాకరించిందని, ఇప్పుడు ప్రపంచ దేశాలు ఆయనను కొనియాడుతున్నాయని, ప్రపంచ నేతలు ఆయనతో వేదికను పంచుకుంటున్నారని అన్నారు.
మోదీకి రెడ్ కార్పెట్ పరుస్తున్నారని, అలాంటి ప్రధానిపై కాంగ్రెస్ (Congress) ఇష్టారీతిన మాట్లాడుతోందని, ఆ పార్టీ నేతలు ఆయనను విషసర్పం అంటున్నారన్నారని మండిపడ్డారు. వాస్తవానికి ఈ దేశాన్ని సోనియా నాశనం చేశారని, ఆమె విషపూరితమైన వ్యక్తి అని విమర్శించారు.బసనగౌడ (Basanagowda) వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రణ్ దీప్ సుర్జేవాలా (Randeep Surjewala) తీవ్రంగా స్పందించారు. కర్ణాటక బీజేపీ (BJP) నేతలు మెంటల్ బ్యాలెన్స్ కోల్పోతున్నారని విమర్శించారు. రాజకీయంగా కూడా వారు పరపతిని కోల్పోతున్నారన్నారు. బసనగౌడను బీజేపీ సస్పెండ్ చేయాలని పలువురు కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు.