ఛత్తీస్గడ్(Chhattisgarh)పై ఆమ్ ఆద్మీ పార్టీల వరాలు జల్లులు కురిపించింది. ఈ ఏడాది చివరన ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో ఛత్తీస్‌గఢ్ కూడా ఒకటి అధికారాన్ని అందుకునేందుకు ప్రధాన పార్టీలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ (BJP) అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. మరోపైపు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) సైతం ఎన్నికల సన్నాహాలు మొదలుపెట్టింది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ‘ఆప్’ ఇక్కడ మొదటిసారి అదృష్టాన్ని పరీక్షించుకుంది.
85 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది, కానీ గెలవలేకపోయింది. దీంతో ఈసారి పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగుతోంది.300 యూనిట్ల వరకూ గృహ అవసరాల కోసం వినియోగించే విద్యుత్‌ను ఉచితంగా (Electricity free) అందిస్తామని ఆప్ వాగ్దానం చేసింది. పలు హామీలతో కూడిన ”గ్యారెంటీ కార్డు”ను ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) విడుదల చేశారు. ఒక రోజు పర్యటన కోసం శనివారంనాడు రాయ్‌పూర్ వచ్చిన కేజ్రీవాల్ ఆప్ కార్యకర్తల సదస్సును ఉద్దేశించి ప్రసంగించారు.ఆయన వెంట పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా పాల్గొన్నారు. గత ఐదు నెలలో రాష్ట్రంలో కేజ్రీవాల్ పర్యటించడం ఇది మూడోసారి.