పాన్ ఇండియా సినిమాలతో తెలుగు సినిమా క్రేజ్‌ను ప్రపంచానికి చాటిన హీరో ప్రభాస్. ఈశ్వర్‌తో తెరంగ్రేటం చేసిన ఆయన రెబల్ స్టార్‌గా గుర్తింపు పొంది అనతికాలంలోనే పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. బాహుబలితో బాక్సాఫీస్‌ను షేక్ చేసి.. భారత చలన చిత్ర చరిత్రలోనే రెండు రూ.1000 కోట్ల సినిమాలు చేసిన ఏకైక హీరోగా నిలిచారు. హీరోగానే కాకుండా వ్యక్తిత్వంలోనూ గొప్ప మనసు చాటుకుంటున్నారు. ఇవాళ ఆయన 45వ పుట్టినరోజు.