అమెజాన్ ప్రైమ్ వేదికగా రిలీజైన ‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్ భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా దీనిపై సిరీస్ నిర్మాతల్లో ఒకరైన ఫర్హాన్ అక్తర్ కీలక అప్డేట్ ఇచ్చాడు. ఈ సిరీస్ను సినిమాగా విడుదల చేస్తున్నట్లు ‘X’ వేదికగా ప్రకటించాడు. ఈ సినిమాలో కాలీన్ భయ్యా పాత్రలో పంకజ్ త్రిపాఠి, మున్నాగా దివ్యేందు నటించనున్నట్లు తెలిపాడు. ఇక ఈ మూవీకి గుర్మీత్ సింగ్ దర్శకత్వం వహించనున్నట్లు వెల్లడించాడు.