బాలీవుడ్ అగ్ర నటుడు సల్మాన్ ఖాన్కు వరుస బెదిరింపుల నేపథ్యంలో బుల్లెట్ ప్రూఫ్ కారు కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. తన భద్రతపై ఫోకస్ పెట్టిన సల్మాన్.. దుబాయ్ నుంచి రూ.2కోట్ల విలువైన కారు దిగుమతి చేసుకోనున్నట్లు సమాచారం. కాగా, కృష్ణజింకలను వేటాడిన కేసు విషయంలో ఇప్పటికే పలుమార్లు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చాయి. సల్మాన్ ఇంటి వద్ద కాల్పులు కూడా జరిగాయి.