కోలీవుడ్ హీరో విజయ్ నటించిన ‘లియో’ సినిమా విడుదలై ఏడాది పూర్తైంది. ఈ నేపథ్యంలో సినిమాను గుర్తు చేసుకున్న దర్శకుడు లోకేశ్ కనగరాజ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ‘ఈ మూవీ చిత్రీకరణ సమయంలో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నా.. ఎన్నో జ్ఞాపకాలు సొంతం చేసుకున్నా.. ఈ సినిమా నాకెప్పటికీ ప్రత్యేకమే. ఇలా జరిగేలా చేసినందుకు లవ్యూ విజయ్ అన్నా. ఈ సినిమా కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ, ప్రేక్షకులకు నా నమస్కారాలు’ అని పేర్కొన్నారు.