మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా దర్శకుడు కరుణ కుమార్ తెరకెక్కిస్తున్న మూవీ ‘మట్కా’. నవంబర్ 14న పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు జోరందుకున్నాయి. తాజాగా ఈ మూవీలో అజయ్ ఘోష్ పాత్రను మేకర్స్ రివీల్ చేశారు. ఆయన లుక్తో ఓ పోస్టర్ విడుదల చేశారు. ఈ మూవీలో అప్పలరెడ్డిగా అజయ్ ఘోష్ కనిపించనున్నారు.