AP: తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. స్వామివారి లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వును వినియోగించారన్న వార్తలపై తాజాగా హీరోయిన్ ఖుష్బూ స్పందించారు. కల్తీకి పాల్పడ్డవారు ఎవరైనా సరే మూల్యం చెల్లించుకోవాల్సిందేనని అన్నారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అన్నీ చూస్తున్నాడంటూ ఖుష్బూ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ పెట్టారు.