దర్శక దిగ్గజం రాజమౌళి ప్రస్తుతం కెన్యాలో ఉన్నారు. తాజాగా ఆయన ఇన్స్టాలో సింహం ఫొటోను షేర్ చేశారు. ‘క్రిస్ ఫాలోస్ తీసిన సరెంగేటి రాజు ఫొటో ఇది. దీని పేరు BOB జూనియర్’ అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. మహేష్ బాబుతో తీస్తున్న సినిమా లొకేషన్స్ కోసం ఆయన అక్కడి వెళ్లారని కొందరు నెటిజన్లు చర్చించుకుంటున్నారు. మరికొందరు షూటింగ్ అప్డేట్లు ఇవ్వండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు.