33ఏళ్ల తర్వాత తమిళ స్టార్ రజినీకాంత్, దర్శకుడు మణిరత్నం కాంబోలో మూవీ రానున్నట్లు ఇటీవల వార్తలొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా వాటిపై మణిరత్నం భార్య, నటి సుహాసిని స్పందించారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి వారి కాంబోలో ఏ సినిమా రావడం లేదని, ఈ విషయం వాళ్లకే తెలియదని తెలిపారు. ఎవరైతే ఇలాంటి నకిలీ వార్తలు సృష్టించారో.. వారికి మాత్రమే ఈ సినిమా గురించి తెలుసని పేర్కొన్నారు.