మెగాస్టార్ చిరంజీవిని మరో ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. యూఏఈలోని అబుదాబిలో ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ(IIFA) అవార్డ్స్- 2024 వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ‘ఔట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇండియన్ సినిమా’ అవార్డును చిరు అందుకున్నారు. ఈ అవార్డు రావడం పట్ల చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చిరుని బాలయ్య కౌగిలించుకున్నారు.