రజనీకాంత్‌తో దిగిన ఫొటో వైరల్ అవ్వడంపై రాహుల్ సిప్లిగంజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నేను రజనీకాంత్‌కు వీరాభిమానిని, ఓ సినిమా షూటింగ్లో ఆయన్ని కలిసినప్పుడు మూవీ లుక్‌లోనే నాతో ఫొటో దిగారు. సినిమా రిలీజ్ అయ్యేవరకు ఫొటో షేర్ చేయొద్దని చెప్పారు. పది రోజుల తరువాత సంతోషం తట్టుకోలేక షేర్ చేశాను. అది కాస్త వైరల్ అయింది. నా జీవితంలో నేను చేసిన తప్పు అదే, అలా చేసినందుకు బాధపడుతుంటా’ అని అన్నారు.