టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటించిన ‘క’ మూవీ దీపావళి కానుకగా రిలీజై హిట్ టాక్ తెచ్చుకుంది. తాజాగా మేకర్స్ థ్యాంక్స్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కిరణ్ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మా సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మొన్నటివరకు నన్ను పక్కింటి అబ్బాయిగా చూశారు. ఈ చిత్రంతో నన్నొక ఇంట్లో అబ్బాయిలా ట్రీట్ చేశారు. నాకు ఎంతో సంతోషంగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చారు.