కృష్ణా: గుంతలు లేని రాష్ట్రంగా ఏపీని అభివృద్ధి చేయడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో మన రాష్ట్రంలోకి రావాలంటే ప్రయాణికులు ఉలిక్కిపడే వారని ఎద్దేవా చేశారు. విజయవాడ 3వ డివిజన్ లోని నాగార్జుననగర్‌లో సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే శనివారం శంకుస్థాపన చేశారు. జగన్ పుణ్యం వల్ల రాష్ట్రంలో రోడ్లు లేవని ఆరోపించారు.