అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్‌కు ఇటీవల మధ్యంతర బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చేరాడు. ఆయన వెంట తన భార్య లక్ష్మి కూడా ఉంది. దర్శన్ కొంత కాలంగా వెనునొప్పితో బాధపడుతున్నారట. కాగా, అక్టోబర్ 30న వైద్యచికిత్సల కోసం 6 వారాల పాటు కర్ణాటక హైకోర్టు దర్శన్‌కు బెయిల్ ఇచ్చింది.