»Who Is Abdul Karim Telgi Sonyliv Scam 2003 The Telgi Story Is Based On
The Telgi Story: ’స్కామ్ 2003’లో తెల్గీ.. నేపథ్యం ఏంటీ..?
నకిలీ స్టాంప్ పేపర్లను సృష్టించి వేల కోట్లను కొల్లగొట్టిన అబ్దుల్ కరీం తెల్గీ బయోపిక్‌తో ‘స్కామ్ 2003’ సిరీస్ తీశారు. ఆ వెబ్ సిరీస్ సోనీ లైవ్‌లో ఈ రోజు నుంచి ప్రసారం అవుతుంది. స్కామ్ 1992 సిరీస్ తీసిన హన్సల్ మెహతా దీనికి దర్శకత్వం వహించారు.
Who is Abdul Karim Telgi SonyLIV Scam 2003 - The Telgi Story is based on?
The Telgi Story: స్టాక్ మార్కెట్(Stock market) బ్రోకర్ హర్షద్ మెహతా బయోపిక్‌గా తెరకెక్కిన స్కామ్ 1992(Scam 1992) సిరీస్ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఆ వెబ్ సిరీస్ తీసిన హన్సల్ మెహతా(Hansal Mehta) ‘మరో స్కామ్’ 2003(Scam 2003) ద తెల్గీ స్టోరీస్ తీశారు. ఆ సిరీస్ సోనిలైవ్(Sony Live)లో సెప్టెంబర్ 1 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. సంజయ్ సింగ్ తెల్గీ స్కామ్: రిపోర్టర్స్కి డైరీ ఆధారంగా తెరకెక్కించారు.
అబ్దుల్ కరీం తెల్గీ అంటే ముందుగా గుర్తొచ్చేది నకిలీ స్టాంపుల పేరు. ఈ కుంభకోణంలో ప్రధాన సూత్రధారి. 1961లో జన్మించిన తెల్గీ.. నకిలీ నేర సామ్రాజ్యానికి అధిపతిగా ఎదిగారు. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి.. ఈజీగా డబ్బు సంపాదించేందుకు అక్రమ మార్గం పట్టారు. సౌదీ అరేబియా వెళ్లాడు. తరువాత తిరిగి వచ్చి మరో కోణంలో జీవితాన్ని ప్రారంభించారు. మొదట నకిలీ పాస్‌పోర్ట్‌లపై దృష్టి పెట్టాడు. ఇమ్మిగ్రేషన్ తనిఖీలను తప్పించుకోవడానికి.. కార్మికులను అనుమతించే నకిలీ పత్రాలను అతని కంపెనీ తయారు చేసేది. దీనిని పరిశ్రమలో పుషింగ్ అని పిలుస్తారు. ఆ తరువాత నకిలీ స్టాంప్ పేపర్లపై దృష్టి పెట్టాడు. నకిలీ స్టాంపులను బ్యాంకులు, బీమా కంపెనీలు, స్టాక్ బ్రోకరేజ్ సంస్థలకు విక్రయించడానికి 300 మంది ఏజెంట్లను నియమించాడు.
అలా రూ. ₹30,000 కోట్ల మోసం చేశాడు. కొన్నేళ్ల తర్వాత నకిలీ స్టాంపుల కుంభకోణం బయటకు వచ్చింది. 2006లో తెల్గీకిి 30 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. 2007లో అదనంగా మరో 13 ఏళ్ల శిక్షతో పాటు రూ. 202 కోట్ల జరిమానా కూడా చెల్లించారు. తెల్గీ విలాసవంతమైన జీవినానికి అలవాటు పడ్డాడు. డ్యాన్స్ బార్లలో విపరీతంగా ఎంజాయ్ చేసేవాడు. ఓ సాయంత్రం ₹90 లక్షలను బార్లో ఖర్చు చేశారు అంటే అతని తీరు హైఫై లైఫ్ ఏంటో అర్థం అవుతుంది. వెలియాలికి రూ.80 లక్షలు ఇచ్చినట్టు అప్పట్లో వార్తలు చదివాం. 2017లో అనారోగ్య కారణాలతో చనిపోయాడు.