అల్లు తరహాలోనే హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకునేందుకు ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాడు అల్లు శిరీష్. కానీ ఈ యంగ్ హీరో మాత్రం సరైన సక్సెస్ అందుకోలేకపోతున్నాడు.. ఈ క్రమంలో ‘ఏబీసీడీ’ వంటి ప్లాప్ తర్వాత.. మూడేళ్ళ గ్యాప్‌తో ‘ఊర్వశివో రాక్షసివో’ అనే సినిమాతో.. నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకొచ్చాడు అల్లు శిరీష్. ఎలాగైనా సరే.. ఈ సినిమాతో హిట్ కొట్టాలని గట్టిగానే ప్రమోట్ చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు బాలకృష్ణ రావడంతో.. మంచి హైప్ క్రియేట్ అయింది.
అయితే అల్లు అరవింద్ అడగ్గానే.. ఈవెంట్ గెస్టుగా వచ్చి శిరీష్‌కు తనవంతు సపోర్ట్ ఇచ్చారు బాలయ్య. కానీ సొంత అన్న అల్లు అర్జున్ మాత్రం ‘ఊర్వశివో రాక్షసివో’ గురించి ఎక్కడ ప్రస్థావించకపోవడం.. ఇండస్ట్రీ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అది కూడా సొంత బ్యానర్లో వస్తున్న సినిమాను.. బన్నీ ఎందుకు ప్రమోట్ చేయలేదనేది అర్థం కాని విషయమే.
మిగతా హీరోలను ప్రమోట్ చేయడంలో ముందుండే బన్నీ.. శిరీష్(allu sirish)ను ఎందుకు పట్టించుకోలేదని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. పైగా అల్లు అర్జున్(Allu arjun) ఇప్పుడు పాన్ ఇండియా హీరో.. కాబట్టి శిరీష్ సినిమాకు ప్రమోషన్స్ చేసి ఉంటే.. ఖచ్చితంగా మరింత బజ్ వచ్చి ఉండేది. కానీ కనీసం ట్వీట్ కూడా చేయకపోవడంతో.. అల్లు బ్రదర్స్ మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ జరుగుతోందనే టాక్ ఊపందుకుంది. లేదంటే బన్నీ ఖచ్చితంగా తమ్ముడి సినిమాను ప్రమోట్ చేసేవాడని అంటున్నారు. మరి అన్న ప్రమోషన్స్ లేకుండా.. ‘ఊర్వశివో రాక్షసివో’తో శిరీష్ ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి.