Vijay Antony: పవన్ ‘బ్రో’తో బిచ్చగాడు హీరో పోటీనా?
కోలీవుడ్ హీరో విజయ్ అంటోని గురించి అందరికీ తెలిసిందే. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ.. తమిళ్, తెలుగు ప్రేక్షకులను అలరిస్తునే ఉన్నాడు. తను చేసే ప్రతి సినిమాను తెలుగులో డబ్బింగ్ చేస్తునే ఉన్నాడు. ఇటీవలె బిచ్చగాడు మూవీతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. అయితే ఈ సినిమాతో పవర్ స్టార్‌తోనే పోటీ పడబోతుండడం ఆసక్తికరంగా మారింది.
2016లో దర్శకుడు శశి తెరకెక్కించిన ‘బిచ్చగాడు’ సినిమా(Bichagadu Movie)తో తెలుగులో మంచి ఫాలోయింగ్ పెంచుకున్నాడు విజయ్(Vijay Antony). అప్పటి నుంచి తన సినిమాలను తెలుగులో డబ్బింగ్ చేస్తునే ఉన్నాడు. ఇటీవలె బిచ్చగాడు2 సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు విజయ్ ఆంటోనీ హీరోగా నటించడమే కాకుండా.. దర్శకత్వం వహించి, మ్యూజిక్ కూడా అందించాడు. ఇక ఈ సినిమా సక్సెస్ జోష్‌లో ఉన్న విజయ్ ఆంటోని.. త్వరలోనే మరో కొత్త సినిమా ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నాడు. గత చిత్రాల మాదిరిగానే థ్రిల్లర్ జోనర్లో వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ‘హత్య’ అనే సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది.
విజయ్ ఆంటోని(Vijay Antony) సరసన రీతికా సింగ్(Ritika singh) హీరోయిన్గా నటిస్తోంది. రీసెంట్‌గానే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించాడు విజయ్ ఆంటోని. ‘హత్య’ సినిమా(Hatya Movie)ను జులై 21వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు అనౌన్స్ చేశాడు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన వారానికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan) నటించిన ‘బ్రో’ మూవీ(Bro Movie) థియేటర్లోకి రాబోతోంది. సముద్రఖని దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ కీ రోల్ ప్లే చేస్తున్న ‘బ్రో’ మూవీ పై భారీ అంచనాలున్నాయి.
ఇలాంటి సినిమాకు వారం రోజుల ముందు విజయ్ ఆంటోని(Vijay Antony) రావడం అంటే.. రిస్క్ అనే చెప్పాలి. ఒక్క వారంలోనే విజయ్ తన సత్తా చాటుకోవాల్సి ఉంటుంది. లేదంటే.. సినిమా టాక్ ఏ మాత్రం తేడా కొట్టినా.. బ్రో సినిమా మ్యానియాలో హత్య థియేటర్లోకి వచ్చిన సంగతి కూడా తెలియకుండా పోతుంది. కానీ బిచ్చగాడు క్రేజ్‌తో హత్య సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. మరి బ్రో(Bro Movie)ని తట్టుకొని హత్య ఎంత వరకు నిలబడుతుందో చూడాలి.