వరుణ్-లావణ్యల నిశ్చితార్థం జూన్ 9న నాగబాబు (Naga Babu) ఇంట్లో గ్రాండ్‌గా జరిగింది. అయితే ఆ వెంటనే ఈ జంట పెళ్లి పీటలెక్కుతుందని అనుకున్నారు. కానీ ఈ విషయంలో క్లారిటీ ఇవ్వలేదు నాగబాబు. అయితే ఇప్పుడు పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi)ల వివాహం ఆగస్ట్ 24వ తేదీన డెస్టినేషన్ వెడ్డింగ్‌గా ఇటలీలో జరగబోతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే పెళ్లి వార్తను అధికారికంగా వెల్లడించే ఛాన్స్ ఉందంటున్నారు. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ, లావణ్య ఫ్యామిలీలతో పాటు దగ్గరి బంధువులు, ఇరువురి స్నేహితులు హాజరవుతారని తెలుస్తోంది.
ఇప్పటికే విదేశాల్లో పెళ్లికి సంబంధించిన షాపింగ్ స్టార్ట్ చేసినట్లు సమాచారం. ఇటీవలే ఇటలీ వెళ్లొచ్చిన వరుణ్, లావణ్య.. రీసెంట్గా కాఫీ డేట్‌కు వెళ్లిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం వరుణ్ తేజ్(Varun Tej), ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ‘గాంఢీవధారి అర్జున’ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆగస్టు 25న ఈ రిలీజ్ కానుంది. ఈ లెక్కన ఈ సినిమా విడుదల టైమ్‌కి వరుణ్ తేజ్ పెళ్లి పనుల్లో బిజీగా ఉంటాడని చెప్పొచ్చు. అలాగే ఈ సినిమా ప్రమోషన్స్‌కు కూడా వరుణ్ దూరంగా ఉంటాడనే చెప్పాలి. అయితే మెగా ఫ్యామిలీ (Mega Family) నుంచి ఇంకా పెళ్లి డేట్ ప్రకటించలేదు కాబట్టి.. ఇందులో నిజముందా? అనే డౌట్స్ వస్తున్నాయి. కానీ గతంలో ఇలాగే జరిగిన ప్రచారాన్ని నిజం చేస్తూ.. ఎంగేజ్మెంట్ చేసుకున్నారు వరుణ్, లావణ్య. కాబట్టి.. ఈ వార్తలు కూడా నిజమయ్యే ఛాన్సెస్ లేకపోలేదు. మరి దీని పై నాగబాబు క్లారిటీ ఇస్తారేమో చూడాలి.