రాజమౌళి తెరకెక్కించిన బాహబలి తర్వాత మరిన్ని భారీ ప్రాజెక్ట్స్ చేసేందుకు రెడీ అవుతున్నారు మన దర్శక, నిర్మాతలు. ఇటీవలె లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం తన డ్రీమ్ం ప్రాజెక్ట్ ‘పొన్నియిన్ సెల్వన్ పార్ట్1’ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ప్రస్తుతం సెకండ్ పార్ట్ పనులతో బిజీగా ఉన్నారు మణిరత్నం.
ఇక ఇప్పుడు మరో స్టార్ డైరెక్టర్ శంకర్.. అంతకు మించి అనేలా భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రామ్ చరణ్‌తో ఆర్సీ 15 ప్రాజెక్ట్‌తో పాటు.. కమల్ హాసన్‌తో ఇండియన్ 2 చేస్తున్నాడు శంకర్. ఇక ఈ సినిమాల తర్వాత శంకర్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటనే ఆసక్తి అందరిలోను ఉంది.
అయితే ఇప్పటికే బాలీవుడ్ యంగ్ హీరో రణ్ వీర్ సింగ్‌తో అపరిచితుడు రీమేక్ కమిట్ అయ్యాడు శంకర్. కానీ ఇప్పుడా ప్రాజెక్ట్‌ను పక్కకు పెట్టి.. భారీ మల్టీస్టారర్‌కు రంగం సిద్దం చేస్తున్నాడట. తమిళంలో వేల్పరి అనే నవల ఆధారంగా ఈ సినిమా ఉంటుందని చాలా రోజులుగా వినిపిస్తోంది. ఇప్పుడీ ప్రాజెక్ట్‌లో హీరోగా రణ్వీర్ సింగ్ ఫిక్స్ అయ్యాడని టాక్. అలాగే సూర్య.. యష్.. కూడా నటించనున్నారని తెలుస్తోంది.
ఈ సినిమా కథకు స్కోప్ ఎక్కువగా ఉండడంతో.. దీన్ని మూడు భాగాలుగా రూపొందించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాదిలో షూటింగ్ మొదలు పెట్టబోతున్నట్టు టాక్. ఈ సినిమా ఇండియన్ సినిమా హిస్టరీలోనే.. అత్యధిక భారీ బడ్జెట్‌తో.. విజువల్ వండర్‌గా రానుందని కోలీవుడ్ వర్గాల సమాచారం. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి తెలియాలంటే.. ఆర్సీ15, ఇండియన్ 2 రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.