నాగచైతన్యతో విడిపోయిన తర్వాత.. సమంత ఎలాంటి పోస్ట్ చేసిన క్షణాల్లో వైరల్ అవుతుంది. ఫ్యాన్స్ కూడా సామ్ సోషల్ మీడియా అకౌంట్లపై ఓ కన్నేసి ఉంచేవారు. సామ్ సైతం ఫ్యాన్స్‌కు అప్పుడప్పుడు రిప్లే ఇవ్వడం.. ట్రోలింగ్‌కు కౌంటర్ వేయడం చేస్తుండేది. కానీ గత కొద్ది రోజులుగా నెట్టింట్లో డీ యాక్టివేట్ అయిపోయింది ఈ హాట్ బ్యూటీ. అందుకు ఎన్నో కారణాలు వినిపించాయి.
అమెరికా వెళ్లిందని, కొత్త సినిమా కోసం ట్రైనింగ్ తీసుకుంటోందని.. ఏదో సర్జరీ చేసుకుందని వార్తలొచ్చాయి. ఇదిలా ఉంటే.. అసలు చైతూ-సామ్ ఎందుకు డివోర్స్ తీసుకున్నారనేది.. ఇప్పటికీ అంతుచిక్కని విషయమే. ఈ విషయంలో ఎప్పటికప్పుడు మాట దాటేస్తున్నారు ఇద్దరు. అయితే ఈ సారి సమంత తప్పించుకునే ఛాన్స్ లేదంటున్నారు. మామూలుగానే బాలయ్య ఎదురుగా ఉంటే దబిడి దిబిడే. అలాంటి బాలయ్య బాబుతో ముఖాముఖీ అంటే మామూలు విషయం కాదు. ఎలాంటి విషయాన్నైనా సరే.. తనదైన స్టైల్లో ఆన్సర్ రాబట్డడం బాలయ్య స్టైల్. ఇదే విషయం ఆహా ఓటిటిలో వచ్చిన ఆన్ స్టాపబుల్ షోతో ప్రూవ్ అయింది. ప్రస్తుతం అన్ స్టాపబుల్ సీజన్ 2కి రంగం సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి పలువురు స్టార్స్‌ను గెస్ట్లుగా తీసుకురాబోతున్నారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. సీజన్ 2 ఫస్ట్ గెస్ట్‌గా సమంతను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారట. ముందుగా మెగాస్టార్ వస్తారని వినిపించినా.. ఇప్పుడది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. అందుకే స్పెషల్‌గా ఉండాలంటే.. సమంతతో స్టార్ట్ చేయాలని చూస్తున్నారట. ఇదే నిజమైతే విడాకుల విషయంలో బాలయ్య నుంచి సమంత తప్పించుకోవడం కష్టమనే చెప్పాలి. అయితే అసలు ఈ షోకి సమంత వస్తుందా.. అనేది కాస్త సందేహమే.