హీరోయిన్ అంటే అందం, కేవలం సినిమా కి గ్లామర్ కోసమే హీరోయిన్లు ఉండేది అనే భావన చాలా మందిలో ఉంటుంది. కేవలం హీరో పక్కన ఆడి పడటానికి మాత్రమే హీరోయిన్లను తీసుకుంటారు అని అందరూ అనుకుంటారు. కానీ ఇప్పుడిప్పుడే ఆ భావన మారుతోంది. హీరోయిన్లు కూడా మంచి క్యారెక్టర్ ఉన్న పాత్రలు ఎంచుకుంటున్నారు. అయితే, వీరిందరరిలో సాయి పల్లవి మాత్రం భిన్నం.
సాయిపల్లవి(Sai pallavi) తన కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి కేవలం ప్రాధాన్యత ఉన్న పాత్రలే ఎంచుకున్నారు. ఏ సినిమాలోనూ తనకు కంఫర్ట్ లేని పాత్రలు చేయలేదు. ఎక్స్ పోజింగ్ అనే మాట రాలేదు. అందుకే ఆమె అంటే అందరికీ అభిమానం. తాజాగా ఈ బ్యూటీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 8 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆమె నటించిన ప్రతి పాత్రకు ది బెస్ట్ అనిపించుకుంది. తన యాక్టింగ్ వెర్సటాలిటీతో నిజంగానే హైబ్రీడ్ పిల్ల అనిపించుకుంది. వినోదం అయినా, భావోద్వేగం అయినా హావభావాల్లో క్వీన్‌గా గుర్తింపు పొందింది. ఆమెకు లేడీ పవర్ స్టార్ అనే బిరుదు కూడా ఫ్యాన్స్ ఇచ్చారంటే ఆమె క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రేమమ్ మూవీతో తన కెరీర్ మొదలుపెట్టింది.దక్షిణాది అన్ని భాషల్లోనూ అదరగొడుతోంది. కాగా ఈ మధ్య చాలా గ్యాప్ ఇచ్చింది.
‘విరాట పర్వం’, ‘గార్గి’ చిత్రాల తర్వాత సాయి పల్లవి(Sai pallavi) తెరపై కనిపించి చాలా రోజులవుతోంది. సెలెక్టివ్‌గా, నచ్చిన కథలను ఎంపిక చేసుకుంటూ ప్రత్యేకతని చూపించే సాయి పల్లవి ఏడాది కాలంగా తెరపై కనిపించకపోవడానికి గల అసలు కారణం తాజాగా బయటపెట్టారు. తనకి గ్యాప్ రాలేదని.. తానే సినిమాల నుండి గ్యాప్ తీసుకున్నానని చెప్పారు. కొద్దిరోజులు సినిమా షూటింగ్స్ నుండి బ్రేక్ తీసుకుందామనుకునే ఏ సినిమా ఒప్పుకోలేదని చెప్పారు. ప్రస్తుతం సాయి పల్లవి తమిళనాట కమల్ హాసన్ నిర్మాణంలో తెరకెక్కబోయే శివ కార్తికేయన్ మూవీలో హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ మధ్యనే ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.