సీనియర్ నటుడు నరేష్(Senior Actor Naresh), పవిత్రా లోకేష్(Actress Pavitra Lokesh) కలిసి నటించిన చిత్రం మళ్లీ పెళ్లి(Malli Pelli Movie). ఈ మూవీకి ఎంఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్నాడు. వివాహ బంధంతో ఒక్కటైన నరేష్, పవిత్రా లోకేష్ ప్రేమ కథను ఈ మూవీ ద్వారా చూపించనున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ‘రారా హుజూరు నాతో’ అనే రొమాంటిక్ సాంగ్‌ను చిత్ర యూనిట్ రిలీజ్(Romantic Song Release) చేసింది.
‘మళ్లీ పెళ్లి’ మూవీ నుంచి రిలీజ్ అయిన సాంగ్:
మళ్లీ పెళ్లి మూవీ(Malli Pelli Movie)కి అరుళ్ దేవ్ మ్యూజిక్ అందించారు. అనంత శ్రీరామ్ తాజాగా విడుదలైన పాటకు సాహిత్యం సమకూర్చారు. గాయని ఇందు సనత్ ఈ పాటను పాడారు. మళ్లీ పెళ్లి మూవీ(Malli Pelli Movie) నరేష్(Senior Actor Naresh) జీవితంలోని కీలక సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు నరేష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. మే 26వ తేదీన ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.