ఇప్పటికే ఈ ఏడాదిలో వచ్చిన ‘ఖిలాడీ’, ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాలు దెబ్బకొట్టినా.. మరోసారి ధమాకా చూపించేందుకు రెడీ అవుతున్నాడు. ఇదే కాదు మరో మూడు సినిమాలతో తగ్గేదేలే అంటున్నాడు మాస్ మహారాజా రవితేజ. లేటెస్ట్ ఫిల్మ్ ‘ధమాకా’.. డిసెంబర్ 23న రిలీజ్ కానుంది.
త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో.. యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా.. రవితేజ మార్క్ ఆఫ్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా రాబోతోంది. దాంతో ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు మాస్ రాజా ఫ్యాన్స్. అలాగే సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్యతో’ కలిసి సందడి చేసేందుకు రెడీ అవుతున్నాడు.
ఆ తర్వాత రావణసుర, టైగర్ నాగేశ్వరరావు సినిమాలు రానున్నాయి. అయితే ఈ సినిమాల కంటే ముందే.. రవితేజ నుంచి మరో మూవీ థియేటర్లోకి రాబోతోంది. ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు సినిమాలను కూడా నిర్మిస్తున్నాడు రవితేజ. ఆర్టీ టీమ్‌వర్క్స్ పై పలు సినిమాలకు నిర్మాణ భాగస్వామిగా ఉంటున్నాడు. ఈ క్రమంలో ‘ఎఫ్ఐఆర్’ తర్వాత కోలీవుడ్ హీరో విష్ణు విశాల్‌తో కలిసి ‘మట్టి కుస్తీ’ అనే సినిమాను నిర్మిస్తున్నాడు.
స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో రూపొందుతున్న ఈ సినిమాకు చెల్లా అయ్యావు దర్శకత్వం వహిస్తున్నారు. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. ‘మట్టి కుస్తీ’ని డిసెంబర్ 2న రిలీజ్ చేస్తున్నట్టు.. సరికొత్త పోస్టర్ ద్వారా ప్రకటించాడు రవితేజ. మరి నిర్మాతగా మాస్ రాజా ‘మట్టి కుస్తీ’ మూవీతో ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి.