Animal: రష్మిక కాళ్లు పట్టుకున్న బాలీవుడ్ హీరో..’యానిమల్’ నుంచి క్రేజీ అప్డేట్
యానిమల్(animal) సినిమా నుంచి వచ్చే ప్రతి కంటెంట్ సినిమా పై అంచనాలు పెంచేలా ఉంటోంది. ఇప్పటికే బయటికి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్.. అదిరింది. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు.
అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ లేటెస్ట్ ఫిల్మ్ ‘యానిమల్(animal)’. ఈ సినిమాలో అసలు సిసలైన వైలెన్స్ అంటే ఎలా ఉంటుందో చూపించబోతున్నాడు సందీప్. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్(ranbir kapoor), రష్మిక(rashmika mandanna) జంటగా నటించిన ఈ సినిమా డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ స్పీడప్ చేశారు మేకర్స్. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ , టీజర్, సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు రెండో సాంగ్‌ను రిలీజ్ చేశారు. నే వేరే, నువ్వు వేరే.. అంటూ సాగే ఈ వీడియో సాంగ్ చాలా ఎమోషనల్‌గా ఉంది. ఫస్ట్ సాంగ్‌లో రణబీర్, రష్మిక ప్రేమించుకోవడం, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా పెళ్లి చేసుకోవడం చూపించారు.
ఇక ఈ సాంగ్‌లో భార్య భర్తల మధ్య గొడవలు, అనుబంధాలు, ప్రేమను చూపించారు. భర్త కోసం భార్య ఎదురు చూడటం..రణబీర్ కపూర్ ఏదో చెప్పడం…రష్మిక కోప్పడటం, ఏడ్వటం సాంగ్‌లో చూడవచ్చు. అలాగే వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్లు చూపించారు. రణబీర్ ఒంటినిండా గాయాలతో పూజ చేయడం, రష్మికను వదిలి వెళ్తున్నప్పుడు.. నేను వస్తానో రానో తెలియదు. కానీ, నువ్వు మాత్రం రెండో పెళ్లి చేసుకోకు అని చెప్పడం.. ఇలా ఈ పాటలో చాలా చూపించాడు సందీప్. మరి యానిమల్ ఎక్కడికి వెళ్లాడు? రష్మిక పరిస్థితేంటి? అనేది తెలియాలంటే.. సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే. అయితే ఈ సాంగ్ మొత్తంలో.. ఓ సన్నివేశంలో రష్మిక కాళ్ళను రణబీర్ కపూర్ పట్టుకోవడం హైలెట్‌గా నిలిచింది. అలాగే.. ఈ సాంగ్లోను లిప్ లాక్ చూపించాడు. మొత్తంగా జస్ట్ సాంగ్స్‌తోనే సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాడు సందీప్(sandeep reddy vanga). మరి ఈ సినిమాతో సందీప్ రెడ్డి ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి.