రెబల్ స్టార్ కృష్ణం రాజు ఆకస్మిక మృతి చెందారు. అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైన ఆయన ఆదివారం తెల్లవారుజామున ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన అందరినీ షాకింగ్ కి గురి చేసింది. ఆయన మృతి చాలా మందిని కలచివేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అందరూ కోరుకున్నారు. అయితే… వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ రియాక్ట్ అయిన విధానం మాత్రం చాలా మందిని విస్మయానికి గురి చేసింది. ఆయన చేసిన ట్వీట్స్ ని కొందరు సమర్థిస్తుండగా.. కొందరు విమర్శిస్తున్నారు.
సోషల్ మీడియా వేదికగా ఆయన వరుస ట్వీట్లు చేశారు. ”మన చావుకి విలువ ఉండాలంటే పోయిన కృష్ణం రాజు గారి లాంటి పెద్ద మనిషికి విలువ ఇద్దాం.. కనీసం రెండు రోజులైనా షూటింగ్ ఆపుదాం” అంటూ మొదటి ట్వీట్ చేశారు ఆర్జీవీ.
అనంతరం ”కృష్ణ గారికి, మురళీ మోహన్ గారికి, చిరంజీవి గారికి, మోహన్ బాబు గారికి, బాలయ్య గారికి, ప్రభాస్, మహేష్, పవన్ కళ్యాణ్ కి నేను ఈ విషయం మీద మనవి చేసేదేంటంటే ఇదే దుస్థితి మీలో ఎవరికీ కూడా తప్పదు. ఒక మహోన్నత కళాకారుడికి ఇవ్వలేని వీడ్కోలు మన మీద మనమే ఉమ్మేసుకోవడం లాంటిదంటూ” రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ ఇప్పుడు దుమారం రేపుతోంది. మరి ఆర్జీవీ ట్వీట్ పై వారు ఎలా స్పందిస్తారో చూడాలి.