ప్రస్తుతం మ్యాన్ ఆఫ్ మాసెస్.. అంటూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు. ఇండియన్ క్రికెట్ టీమ్‌కు చరణ్ పార్టీ ఇచ్చాడని తెలియడంతో.. రచ్చ రచ్చ చేస్తున్నారు. ఆదివారం రోజు భారత్-ఆసీస్ సిరీస్ మూడో టీ20 మ్యాచ్ హైదరాబాద్‌లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఇండియా గెలిచింది. దాంతో మ్యాచ్ తరువాత కొందరు ఇండియన్ క్రికెట్ ప్లేయర్స్‌కు రామ్ చరణ్ పార్టీ ఇచ్చినట్టు తెలుస్తోంది.
కెప్టెన్ రోహిత్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, హార్థిక్ పాండ్యాతో పాటు మరికొంతమంది ప్లేయర్స్.. చరణ్ ఇంటికెళ్ళినట్టు వార్తలొస్తున్నాయి. ఈ సందర్భంగా వాళ్లను చరణ్ సన్మానించి.. వారితో కాసేపు సరదాగా మాట్లాడారట. చరణ్‌తో పాటు మెగా ఫ్యామిలీ కూడా ఈ పార్టీలో పాల్గొన్నారని టాక్. ప్రస్తుతం అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. త్వరలోనే ఈ పార్టీ ఫొటోలను చరణ్ అధికారికంగా షేర్ చేయనున్నారని వినిపిస్తోంది. ఇప్పటికైతే హార్దిక్ పాండ్యతో చరణ్ ఇంట్లో ఓ వ్యక్తి దిగిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. దాంతో ఇది రామ్ చరణ్ క్రేజ్ అంటు హల్ చల్ చేస్తున్నారు ఫ్యాన్స్. అందుకే ఇప్పుడు చరణ్ పేరు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఇక ‘ఆర్ఆర్ఆర్’ తో పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకున్న చరణ్.. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో ఆర్సీ 15 ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఆ తర్వాత ‘జెర్సీ’ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేయాబోతున్నారు.