Prabhas: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రభాస్..!
తన రాబోయే పౌరాణిక చిత్రం 'ఆదిపురుష్' విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రభాస్(Prabhas) ఈరోజు ఉదయం తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి పండితుల ఆశీస్సులు తీసుకున్నారు.
రామాయణ ఇతిహాసం ఆధారంగా డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కిస్తున్న చిత్రం ఆదిపురుష్. ప్యాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్(Prabhas), కృతి సనన్ సీతారాములుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనుండడంతో ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమా ఏ స్థాయిలో ఉండబోతుందో చెప్పేశారు మేకర్స్.ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా గ్రాఫిక్స్ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అన్ని పనులు కంప్లీట్ చేసుకుని జూన్ 16న భారీ ఎత్తున విడుదల కాబోతుంది. దీంతో మూవీ ప్రమోషన్స్ వేగం పెంచారు.
మరోవైపు ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. జూన్ 6 తిరుపతిలో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఇప్పటికే ఆదిపురుష్ మూవీ టీం మొత్తం తిరుమల చేరుకుంది. ప్రభాస్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మంగళవారం వేకువజామున సాంప్రదాయ దుస్తులు ధరించి దేవాలయానికి చేరుకున్నారు. తితిదే అధికారులు ప్రభాస్‌కు స్వాగతం పలికి దర్శనం ఏర్పాటు చేశారు. సుప్రభాత సేవలో పాల్గొన్న ఆయన శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆశీస్సులు పొందారు. తదుపరి రంగనాయకుల మండపంలో వేద పండితుల మంగళాశాసనాలు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు పట్టు వస్ర్త్రాలతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.